Monday, December 29, 2008

మా తాత ఉత్తరం - ఏట్లో పడింది

ఇది చిన్న పిల్లలు ఆడుకొనే ఆట. కనీసం 10 మంది ఉంటే బావుంటుంది. ఒక్కరు తప్ప మిగిలిన అందరూ కొంచెం దూరంగా కూర్చుంటారు. ఒక వ్యక్తి మాత్రం చిన్న చేతిగుడ్డ లేదా మరేదైనా చేతిలో ఇమిడేలా కూర్చున్న వారికి కనిపించకుండా పట్టుకుని వృత్తాకారంలో కూర్చున్న వాళ్ళ చ్ట్టు తిరగాలి (కొంచెం వేగంగా). ఇలా తిరిగేటప్పుడు "మాతాత ఉత్తరం" అంటుండాలి. దానికి జవాబుగా కూర్చున్న పిల్లలు "ఏట్లో పడింది" అంటారు.
ఇలా తిరుగుతూ చేతిలో ఉన్న వస్తువును ఎవరు గమనించకుండా ఒకరి వెనుక వదలాలి. సదరు వ్యక్తి గమనించనట్లైతె, తిరుగున్న వ్యక్తి దానిని తీసుకుని, ఎవరి వెనుకైతే వేసాడొ ఆ వ్యక్తిని చిన్నగా కొడుతూ వృత్తాకారంలో తరుముతారు. ఒకవేళ అలా విడువబడిన వస్తువును (చేతి రుమాలు) గమనిస్తే అది తీసికుని తిరుగుతున్న వ్యక్తిని తరుముతారు.
ఇందులో మజా ఎమంటే, ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరివెనుక చేతి రుమాలు విడువబడిందో గమనించి, చెప్పడానికి చేసే ప్రయత్నం. కళ్ళతో, వివిధ రకాల సైగలతో బహు కష్టపడతారు.
ఆడుతున్నప్పుడు దొంగ కాకూడదని ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళమో. ఇప్పటికీ మా వీధిలో పిల్లలతో, వెన్నెల రాత్రులలో ఆడుతుంటాము..
పంపిన వారు: శృతి

శృతి గారు ధన్యవాదాలు

No comments:

Post a Comment