Thursday, January 15, 2009

ఈ ఆటల గురించి

ఈకింది ఆటల గురించి రాద్దమని నా ఆలోచన. మీరూ ఓ చెయ్యి వెయ్యండి. మీకు తెలిసిన ఆటలు పంపండి.
వంగుళ్లు-దూకుళ్లు
పిచ్చి బంతి
గోలీలు
బెచ్చాలు
గోలీలు-బెచ్చాలు
ఓకులు
కోతికొమ్మచ్చి
వీధీవీధీ గుమ్మడిపండు
ఏడుపెంకులాట
పులి-మేక
అష్టాచెమ్మా

17 comments:

 1. భాస్కర్ గారూ..
  ఇంకా 'దాడీ', తొక్కుడు బిళ్ళ, నాలుగు రాల్లాట, కరంట్ షాక్, నేల-బండ..
  అమ్మాయిలయితే అచ్చనగిల్లలూ, చింత పిక్కలూ.. :)

  మీకు చెన్నాయ్ కుప్పలు ఆట తెలుసా..?
  దీనికి వేరే పేర్లు కూడా ఉంటాయేమో.
  రెండు గ్రూపుల వాళ్ళు నిర్ణీత సమయంలో ఇసుకతో రహస్య స్థావరాలలో చిన్న చిన్న కుప్పలు పెట్టాలి. టైం అయిపోయాక ఒకరివి ఒకరు కనుక్కోగలగాలి. ఎదుటివారికి దొరక్కుండా ఎన్ని కుప్పలు ఎక్కువ ఉంటే అంత గొప్పగా గెలిచినట్టన్నమాట. ఇసుక కుప్పలే కాకుండా.. చాక్ పీస్ తోనూ, బొగ్గుతోనూ గీతాలు గీస్తూ కూడా ఆడతారు.
  మేము బాగా ఆడేవాళ్ళం. చాలా బావుంటుంది. కానీ.. ఎక్కడపడితే అక్కడ గీతలు గీసినందుకు ఇళ్ళల్లో వాళ్ళు తిట్టే వాళ్ళు. ఎందుకంటే.. ఇనుప కుర్చీలకీ, చెక్క స్టూళ్ళకీ అడుగున గీతలు గీసేసే వాళ్ళం మరి :)

  ReplyDelete
 2. దాడీ ని అంజనం అనికూడ అంటారనుకుంటా

  ReplyDelete
 3. మోనోపోలీ
  పిక్షనరీ
  డంబ్ షెరాడ్స్
  స్నేక్స్ అండ్ లేడర్స్
  బింగో
  :) :) :)
  ok ok no more
  వామనగుంటలు
  ముక్కులు గిల్లీలు
  కర్చీఫ్ ఆట
  కుంటాట
  వైకుంఠపాళీ
  గాటీ ......

  ReplyDelete
 4. ఇవన్నీ బాగనే ఉన్నాయి అండీ!! కానీ ఆడె విధానం చెప్పండి..ఒక్కోదానికీ :):)

  ReplyDelete
 5. నేను కొన్ని ఆటలను నా బ్లాగులో సమీక్షించాను. వివరాలకు నా బ్లాగులో http://trajarao.wordpress.com "చిన్ననాటి ఆటలు" పై వివిధ వ్యాసాలను చూడండి. ఇంకా మరి కొన్ని ఆటల గూర్చి రాయాలని ఉన్నా సమయం దొరకక ఆగిపోయాను.

  ReplyDelete
 6. నేను కూడా కొన్ని ఆటలగురించి రాసాను

  ReplyDelete
 7. సాబ్జా-బౌండరి , లఘోరీ బహుసా 7 పెంకుల ఆట అనుకుంటా,
  కుచికుచి పుల్ల

  ReplyDelete
 8. పైన నేను చెప్పిన లఘోరినే పెంకులు పెట్టకుండా కూడ ఆడుతారు అంటే రెండు జట్లు గా విడిపోయి బంతితో కొట్టుకోవడం

  ReplyDelete
 9. donga police ataa meeru marchipoyaru........

  ReplyDelete
 10. భాస్కర్ గారు, మొదటగా, మీ వంటల బ్లొగ్ చాలా బాగుంటుంది. అంటె, వంటలు తెలీనివి కాదు గాని, మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఇంకా, అస్సలు వంట చెయ్యడం లేదా, ఎక్కడో దేశం కాని దేశం లో ఉండి కూడా, మన వంటలు చేసుకుని తినాలనే, అందరికీ తెలియజేయాలనే ఉత్సాహం ఇంకా బావుంది.
  సరె, మీ వంటల పేజి నుంచి ఇక్కడ తేలాను. మీరు చెప్పిన ఆటల్లొ, నాకు నచ్చిన ఆట - వీరి వీరి గుమ్మడిపండు ( మీరు 'వీధి వీధి ' అని రాసారు, కాని మేం ఇలానే అంటాం)

  ముందుగా ఈ ఆటకి కావాల్సింది బోలెడు పిల్లలు, ఒక పెద్ద. అంటె, పెద్ద వాల్లు గాని, పిల్లలోనె ఒక్కరు గాని ఉండొచ్చు. ఈ పెద్ద, తల్లి అన్నమాట.

  స్తెప్ 1:
  సరె, పిల్లలంతా పంటలు వేసుకొని దొంగని డిసైడ్ చెయ్యాలి ( పంటలు అంటె, ముగ్గురు గాని, అంత కంటె ఎక్కువ గాని odd నంబర్ పిల్లల్లు రౌండ్ గా చేతులు పట్టుకొని ఒక్కసారిగా వాటిని వదిలి, రెండు చేతులు తాళం వెస్తున్నట్లు పెట్టాలి. అంటె, ఒక palm మీద ఇంకొ palm close చెస్తున్నట్టో, లేక ఒపెన్ చెస్తున్నట్టొ వేయాలి. ఇప్ప్దు, odd నుంబెర్ పిల్లల్లొ ఒకే లాగ వేసిన even నంబర్ పిల్లలు safe, కాని మిగిలిన పిల్లలు మల్లి అదె లాగ చెయ్యలి. ఆఖరికి ఒక్క పిల్లడు/ఫిల్ల మిగిలుతారు. వీల్లె దొంగ.)
  స్తెప్2:
  ఇప్పుడు, తల్లి ఒక కుర్చీ లొనొ, లేకపోతె ఒక గట్టు మీదో కూర్చొవాలి. ఈ దొంగ ఐన పిల్లవాడు కింద తల్లి వొళ్ళొ కూర్చొవాలి. మిగతా పిల్లలంతా వాళ్ళని face చేస్తూ random orderlo నుంచోవాలి.
  స్తెప్3:
  తల్లి దొంగ కళ్ళు ఒక చేతితొ మూసి ఇంకో చేత్తొ దొంగ చెయ్యి పట్టుకుని, వేలు ఒక పిల్లాడి వైపు చూపిస్తూ పాదుతుంది/తాడు -- వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి?
  స్తెప్4:
  దొంగ ఐన పిల్లడు వాళ్ళ పేరు guess చెయ్యాలి. సరైన పేరు చెప్తె, ఆ పేరు గల వాళ్ళు దొంగ అవుతారు, పాత దొంగ, పిల్లల్లొ వెళ్ళి నించోవచ్చు.
  సరైన పేరు చెప్పక పోతె(eg: పిల్లది పేరు asdf, కాని దొంగ xyz అని చెప్పదు అనుకుందాం), తల్లి పాదుతుంది-- xyz, [దొంగ పేరు] ముక్కు గిల్లి పారిపొ---- ఇప్పుదు asdf దొంగ ముక్కు చిన్నగా గిల్లి పారిపొయి దాంకోవాలి.
  స్తెప్5:
  repeat step4 for all kids.
  స్తెప్6:
  ఇప్పుడు, అందరు పిల్లలూ దాంకున్నాక తల్లి పాడుతుంది-- పిల్లి వచ్చె ఎలుకా భద్రం......... ఎక్కడి దొంగలు అక్కడే...... గప్చిప్ సాంబార్ బుడ్డి.
  స్తెప్7:
  ఇప్పుదు తల్లి దొంగ కళ్ళు విప్పేస్తుంది(ఇక్కడి వరకు, కళ్ళు మూసే ఉంచాలి). దొంగ వెళ్ళి మిగతా వాళ్ళని వెతకాలి. వెతికి, వాళ్ళని ముట్టుకోవాలి. ఇలా ఎవరిని first ముట్టుకుంతే, వాళ్ళు next దొంగ. కాని, దాంకున్నవాల్లు దొంగ తమని ముట్టుకునేలూపు తల్లి ని ముత్తుకుంటే వాళ్ళు safe. ఒక వేళ, దొంగ పట్టుకునే లోపే అందరూ తల్లిని పట్టుకుంతె, అప్పుడు మల్లి same దొంగ దొంగగా ఉంటాడు.

  హమ్మో........ చాలా ఎక్కువ రాసాను. అస్సలు అర్ధం ఐందో లేదో.... సరె, వీలినంత వరకు try చేసాను. చెప్పటానికి కష్టంగా ఉంది కాని ఆడటం చాలా easy.

  ReplyDelete
 11. ఆలింగాలింగు, దండు ఆట, గుర్రపు బెచ్చాలు, గవ్వలాట, పప్పుచారు, సాయిబు గుర్రం, జిగ్గాట, కర్ర-బంతి(బుర్లాట), బిళ్ళంగోడు, జానలాట(రూపాయి బిళ్ళలతో), చిత్తుకొట్టుడు (రూపాయి బిళ్ళలతో), కుందుళ్ళాట, కాగితాలాట (పడవలు,విమానాలు, కెమేరాలు, పుస్తకంలో పెట్టి ఎవరికి పెద్ద నంబరు వస్తే వాళ్ళు తీసుకోవటం, పుస్తకం క్రికెట్)

  ReplyDelete
 12. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ మొదలైనవి పెట్టుబడి వర్గాల ఆటలు. ఇవి అన్ని సామ్రాజ్య వాద వర్గాల రాజ్య కాంక్ష మూలంగ వ్యాప్తి లోకి వచ్చాయి . మనం వీటిని వ్యతిరేకించాలి. దీనికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి

  ReplyDelete
 13. @కలి
  ఎవురయ్యా నువ్వూ!!
  ఆటల్ని నేను ఆటగానే చూస్తా. పొలిటికల్గా ఎందుకు చూడాలి. చేతనైతే పొలిటికల్గా చూసేవాళ్ళ బండారాలు బయటపెట్టు, ఆటల్ని అడ్డుకోటం కాదు!!

  ReplyDelete
 14. bagundi
  pls see da link
  http://sivaprasad-sivaprasad.blogspot.com/2009/05/blog-post_9043.html

  ReplyDelete
 15. $భాస్కర్ గారు

  ఈ బ్లాగుని ఆపొద్దు.. మన ఆటలు పంచుకుంటే రేపు పిల్లలకి చెప్పాలన్నా మనం గుర్తుతెచ్చుకోవాలాన్నా బావుంటుంది.

  ప్లీచ్.. కొత్త టపాతో రండి.

  ReplyDelete
 16. రాముడూ, సీత
  కళ్ళగంతలు
  పులీ మేక...

  ReplyDelete